చూశాకే.. మాట్లాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్ విడుదలైన దగ్గర్నుంచీ వివాదం మొదలైంది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ట్రైలర్ కంటెంట్‌ను బట్టిచూస్తే అలనాటి తార శ్రీదేవి జీవితాన్ని తెరకెక్కించినట్టే ఉందన్న కథనాలు గుప్పుమన్నాయి. దీంతో దివంగత శ్రీదేవి భర్త, నిర్మాత బోనీకఫూర్ ప్రాజెక్టుపై స్పందించడమే కాదు, చిత్రబృందానికి నోటీసులూ పంపారు. అయితే, బోనీ నోటీసులపై ఇటు దర్శకుడు మాంబుల్లి, అటు ప్రధాన పాత్రధారిణి ప్రియా ప్రకాశ్ స్పందించారు. ‘శ్రీదేవి బంగ్లా చిత్రం క్రైం థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కింది. బయోపిక్ కాదు. అనుమతి లేకుండా బయోపిక్‌ను తెరకెక్కించకూడదన్న స్పృహ మాకూ ఉంది. ఒక నటి లండన్‌లో ఎదుర్కొన్న పరిస్థితులే మా కథాంశం. విడుదలకు ముందే సస్పెన్స్‌ను రివీల్ చేయమంటే ఎలా? పాత్రపేరు శ్రీదేవి, బాత్ టబ్ సన్నివేశం కనిపిస్తోంది కనుక నటి శ్రీదేవి జీవిత కథేనంటూ కథనాలు అల్లేస్తున్నారు. బాత్‌టబ్‌లో పడి ఇంకెవ్వరూ చనిపోరా? చనిపోకూడదా? మమ్మల్ని సినిమా విడుదల చేయనివ్వండి. ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రియా చెప్పినట్టుగా అది ఎవరి కథ అన్నది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. బోనీ నోటీసుల్ని ఎలా ఎదుర్కొవాలో మాకు తెలుసు’ అంటూ ట్విట్టర్‌లో స్పందించాడు. ఇంతకుముందే వివాదంపై స్పందించిన ప్రియా ‘నా పాత్ర పేరు శ్రీదేవి, ఆ పాత్ర సినీ నటి కావడం కాకతాళీయకం. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో రాద్ధాంతం చేస్తున్నారు. నటి శ్రీదేవి జీవిత కథో కాదో సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులే తేలుస్తారు’ అని వ్యాఖ్యానించింది.