కనెక్టయ్యారు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించిన భారీ చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి రేసులో మంచి కలెక్షన్స్‌తో రాణిస్తున్న సినిమా గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ ‘మెగా పవర్‌స్టార్ చిత్రం అదీకూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అని తెలియగానే సినిమాపై భారీ అంచనాలుంటాయనే సంగతి తెలిసిందే. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాం. హీరోను మాస్ యాంగిల్‌లో దర్శకుడు బోయపాటి ప్రజెంట్ చేశారు. అన్నదమ్ముల మధ్య అనుబంధం, ఫ్యామిలీ ఎమోషన్స్ కుటుంబ కథాచిత్రాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, డ్యాన్సులకు మాస్ ఆడియెన్స్ కనెక్టయ్యారు. సినిమా సక్సెస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అన్నారు.