హరహర శంభో శంకర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం ‘మహర్షి’లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌కానుంది. ఆ తర్వాత మహేష్ సుకుమార్‌తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఇదో పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సుకుమార్ హింట్స్ ఇచ్చాడు. ఈ సినిమా టైటిల్ గురించి ఫిలింనగర్‌లో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.
ఈమధ్యే సుకుమార్ ఫిలిం ఛాంబర్లో ‘హరహర శంభో శంకర’అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడట. దీంతో ఈ టైటిల్ మహేష్‌బాబుకోసమే సుకుమార్ ఫైనలైజ్ చేసి ఉంటాడని అంటున్నారు. సహజంగా నిర్మాతలు తమ బ్యానర్‌పై టైటిల్స్‌ను రిజిస్టర్ చేయిస్తారు. కానీ ఈ సినిమాను నిర్మించే మైత్రీ మూవీమేకర్స్‌పై కాకుండా రిజిస్టర్ చేయించడం విశేషం. ‘రంగస్థలం’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్ ఈ సినిమాచేస్తూ ఉండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో మహేష్‌తో సుకుమార్ ‘నేనొక్కడినే’ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే ఈ సినిమాపై కాస్త హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడట.