ఫీల్‌గుడ్ గుప్పెడంత ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరోనక్, అతిథిసింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుప్పెడంత ప్రేమ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, ఫస్ట్‌లవ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీగా ఉంటుందని, ఫస్ట్‌లుక్ టీజర్లకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని తొలి ప్రేమ అనుభూతిని అందమైన సెల్యులాయిడ్‌పై దృశ్యకావ్యంగా రూపొందిస్తున్నామని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం యువతరానికి తప్పక నచ్చుతుందని అన్నారు. స్వచ్ఛమైన ప్రేమ భావనకు అర్ధంలా సాగే ఈ చిత్రాన్ని షిల్లాంగ్, చిరపుంజి, మేఘాలయా లాంటి లొకేషన్లలో చిత్రీకరించామని, గుంటూరు, హైదరాబాద్, వరంగల్‌లో షూటింగ్ చేశామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ సుందర్, కెమెరా: సంజయ్ లోక్‌నాథ్, ఆర్ట్: రాజీవ్‌నాయర్, పాటలు: వనమాలి, శ్రీమణి, ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి, దర్శకత్వం: వినోద్ లింగాల.