ఇస్మార్ట్‌గా..పూరీ, రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నటి వరకూ ఊరించిన పూరీ మొత్తానికి మొదలెట్టేశాడు. రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్‌ని ప్రకటించిన పూరీ, ఫస్ట్‌లుక్‌తో హడావుడి లేపాడు. మంచి మాస్ లుక్‌లో రామ్‌ను చూపించిన పూరీ, ఇస్మార్ట్.. షూటింగ్‌ను బుధవారం గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. గురువారం నుంచి నాన్‌స్టాప్‌గా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేసుకుంది. లాంచింగ్‌కు యూనిట్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చార్మీ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభిస్తే, స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మాస్ గెటప్‌లోవున్న రామ్, పిస్టల్‌తో వరుస బుల్లెట్లు షూట్ చేయడాన్ని ముహూర్తపు షాట్‌గా తీశారు. చాలాకాలంగా హిట్టుకు దూరంగా ఉండిపోయిన పూరి, రామ్‌లు, ఈ సినిమాతో సక్సెస్‌ను మరోసారి రుచి చూడాలన్న కసితో కనిపిస్తున్నారు. పూరి దర్శకుడిగానే కాదు నిర్మాతగానూ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. చార్మీ సహ నిర్మాత. అన్నీ సెట్టయినా హీరోయిన్ కోసం వెతుకుతున్న టీం -మొత్తానికి లీడ్ రోల్‌నూ కన్ఫర్మ్ చేసుకుంది. రామ్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ను ఓకే చేసినట్టు టాక్. మరో హీరోయిన్‌ను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. మాస్ కంటెంట్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించనున్నట్టు సమాచారం.