థ్రిల్లర్‌గా లాస్ట్‌బస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో విజయవంతమైన హారర్ చిత్రాన్ని తెలుగులో ‘లాస్ట్‌బస్’ పేరిట శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ పతాకంపై అందిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రంలో అవినాష్ నరసింహ రాజు, మేఘశ్రీ భాగవతార్, ప్రకాష్ బేలవాడి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, తెలుగులోనూ ఇది హిట్ అవుతుందన్న నమ్మకం వుందని, త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఓ అటవీ మార్గంలో ఒకే ఒక్క బస్ వస్తుందని, ఆ ఒక్క బస్సు ఎక్కలేకపోతే ఆ అడవిలో ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. మానసాజోషి, దీపాగౌడ్, రాజేష్, రాకాశంకర్, స్నేహ నాగరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనంత్, ఎడిటింగ్: శ్రీక్రేజీ, సంగీతం: ఎస్.డి.అరవింద్, నిర్మాతలు: శ్రీమంజునాథ మూవీమేకర్స్, రచన, దర్శకత్వం: ఎస్.డి.అరవింద్.