శృంగార తారగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ ఈసారి ఎవరూ ఊహించని పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో ‘సూపర్ డీలక్స్’ చిత్రంలో శృంగార తార (పోర్న్‌స్టార్)గా కనిపించనుందట. అయితే ఈ పాత్రకు మొదటగా మరో సీనియర్ హీరోయిన్‌ను తీసుకుందామనుకున్నాడట డైరెక్టర్. అది వర్క్‌అవుట్ కాకపోయేసరికి రమ్యకృష్ణను ఓకే చేశారని సమాచారం. 2004లో వచ్చిన సునామి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాసిల్, మిస్కీన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్న చిత్రానికి పిఎస్ వినోద్, నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కుమార్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం మూడుగంటల నిడివితో ప్రేక్షకులముందుకు రానుంది.