అన్నపూర్ణ.. ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరెస్టు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎంఎన్‌ఆర్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. సీనియర్ నటి అన్నపూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. నర్రా శివనాగేశ్వర్‌రావు దర్శకత్వం వహిస్తున్న సినిమా అమరావతి పరిసరాల్లోని అందమైన గ్రామంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను వెల్లడిస్తూ ఓ పల్లెటూరిలో ఎవరికీ ఏంజరిగినా రచ్చబండ పంచాయతీ దర్బార్‌లో పెద్దదిక్కైన అక్కినేని అన్నపూర్ణమ్మ పాత్రలో అన్నపూర్ణ కనిపిస్తున్నారు. ఆ పల్లెటూరిలోనే ఆమెకు ధీటుగా ఎదురెళ్లే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగా సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు. దీనికోసం ఊరిలో వేసిన పంచాయతీ దర్బార్ సెట్ అందరినీ ఆకర్షిస్తోంది. పంచాయతీ సన్నివేశాను 200మంది జూనియర్ ఆర్టిస్టులతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్రంలో అర్చన హీరోయిన్‌గా నటిస్తుంటే జీవ, రఘుబాబు, కాటమంచి రఘు, తాగుబోతు రమేష్, సుమన్‌శెట్టి, శ్రీహర్ష, అదుర్స్ సాయి, రమాప్రభ, శ్రీలక్ష్మి, ప్రభ, జయవాణి తదితరులు నటిస్తున్నారని నిర్మాత వెల్లడించారు.