ఆరెక్స్ హీరో కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆర్‌ఎక్స్100’తోనే సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కొత్త తెలుగు హీరో కార్తికేయ. ఆ తర్వాత కార్తికేయ వరసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ ప్రాజెక్టులలో ఒకటి బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కార్తికేయకు జోడీగా మలయాళంలో క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న అనఘ మురుతోరను ఫిక్స్‌చేశారట. ఈ మలయాళ సుందరికి తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ బ్యూటీ లాస్ట్ ఇయర్ తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందట. ఇప్పుడు తెలుగును కూడా కవర్‌చేస్తోంది. కార్తికేయ మొదటి సినిమాతో పాయల్‌రాజ్‌పుత్ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పుడు రెండో సినిమాతో అనఘకు కూడా అలాంటి అదృష్టం పడుతుందేమో వేచిచూడాలి. ఇప్పటికే మలయాళ బ్యూటీలు టాలీవుడ్‌ను ఏలుతున్నారు. ఆ లిస్టులో కొత్త బ్యూటీ చేరినట్టే.