నా పేరే భారత్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన ఫిట్‌నెస్‌ను ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సల్మాన్ తాజా చిత్రం -్భరత్. కత్రినా కైఫ్ హీరోయిన్. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రాన్ని టీ సిరీస్ సమర్పిస్తోంది. అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న భారత్ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. సల్మాన్ ఫిట్‌నెస్‌ను చూపిస్తూ వివిధ గెటప్పులతో కట్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ మొత్తం సల్మాన్ సన్నివేశాలతోనే నింపేశారు. ‘నీ ఇంటి పేరు, జాతి ఏమిటి? అని జనం నన్ను అడుగుతుంటారు. వాళ్లకు చెప్పే సమాధానమొక్కటే. దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మా నాన్న నాకు పేరు పెట్టాడు. అదే భారత్ -అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో సల్మాన్ టీజర్‌లో కనిపించాడు. చిత్రమైన కథతో తెరకెక్కుతున్న భారత్‌లో టబు, జాకీష్రాప్, సోనాలీ కులకర్ణి, దిశాపటానీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.