తెలుసుకుని ఏంచేస్తావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ విజయ్ హీరోగా, మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం -సూర్యకాంతం. ఈ చిత్రం టీజర్ శుక్రవారం విడుదలైంది. టీజర్ మొత్తం ఫన్నీఫన్నీగా సాగిపోయింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రాన్ని నిర్మాత సందీప్ ఎర్రమరెడ్డి నిర్మిస్తున్నారు. రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. టీజర్‌లో హీరో రాహుల్ విజయ్ మీ పేరేంటండీ అని అడిగితే ‘తెలుసుకుని ఏం చేస్తావ్. నీకు పుట్టే పిల్లలకు పెట్టుకుంటావా’ అని నీహారిక అడగటం ఫన్నీగా ఉంది. మరో సందర్భంలో ‘నీ గురించి చెప్పు’ అని నిహారిక అడగటం, హీరో పేరు చెప్తుండగానే ‘ఆ తెలుసుకుని నేనేం చేస్తాలే’ అని ఆమె కట్ చేయడం బావుంది. ఈ సందర్భానికి అనుగుణంగా హీరోతో అతని ఫ్రెండ్ చెప్పే డైలాగ్‌ను టీజర్‌లో కట్ చేశారు. -‘మామూలుగానే అబ్బాయిలతో అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడుకుంటారు. నువ్వేమో ఏకంగా ఫుట్‌బాల్ ప్లేయర్‌తోనే పెట్టుకున్నావ్’ అంటూ హీరో ఫ్రెండ్ హెచ్చరించడాన్ని బట్టి చిత్రంలో నిహారిక క్యారెక్టరైజషన్ ఏమిటో అర్థమవుతోంది. సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.