నాని.. అలాక్కూడా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘అ!’ చిత్రానికి నిర్మాతగా మారి మంచి మార్కులే వేయించుకున్న నాని మరోసారి నిర్మాణంవైపు అడుగులేస్తున్నాడు. త్వరలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి నాని సినిమాలు నిర్మిస్తారట. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో ‘జర్సీ’ చిత్రం చేస్తున్నాడు నాని. ఈ చిత్రంలో అతడు వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత విక్రమ్ కె కుమార్ చిత్రాన్ని అంగీకరించిన నేచురల్ స్టార్, త్వరలో సినిమా నిర్మాణంపై పూర్తిగా దృష్టి సారిస్తాడట. ఆసక్తికరమైన అంశమేమంటే -ఆ రెండు చిత్రాల్లోనూ నానియే హీరోగా నటిస్తాడు. రెండు చిత్రాల్లో ఒక సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించనుండగా, మరో చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇప్పటికే ఇద్దరు నిర్మాతలతో నాని ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇవి త్వరలోనే సెట్స్మీదికి రానున్నాయని, అందులో ఒక చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించనున్నారని టాక్. మహేష్, చరణ్, బన్ని, ప్రభాస్, రానావంటి స్టార్ హీరోలు నిర్మాతలై సినిమాలు నిర్మిస్తున్నారు. హీరోలు నిర్మాతలవ్వడం ట్రెండ్ మంచిదే.