152కు కథ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఓకె అయ్యిందని, చిరు స్క్రిప్ట్ విని సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే చిరు ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సైరా చిత్రంలో నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానుంది.