ఫిబ్రవరిలో మొదలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సినీవర్గాల తాజా సమాచారం ప్రకారం చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. అలాగే ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకోనుందని సమాచారం. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమం మొదలు పెడతారన్నమాట. ఇక ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లోనే రామ్‌లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు తీయనున్నాడు. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు ఒకదాన్నిమించి ఒకటి హిట్టవ్వడంతో ఈ కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వీరిద్దరికి ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. అయితే ఈ చిత్రంలోని చాలాభాగం రాజకీయ నేపథ్యంలో సాగనుందట. రాజకీయాలతోపాటు సమాజంలోని కుళ్లును ప్రశ్నించి ఎండగట్టేలా మంచి పవర్‌ఫుల్‌గా స్క్రిప్ట్ ఉంటుందట. మరి సినిమా కూడా వీరినుంచి వచ్చిన గత సినిమాలులాగే భారీ హిట్టవుతుందేమో చూడాలి.