100కోట్ల క్లబ్‌లో ఎఫ్ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల మల్టీస్టారర్ ఎఫ్-2 రేర్ ఫీట్ సాధించింది. మల్టీస్టారర్ చిత్రాల్లో 100కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. అలాగే ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచి మొదటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 50కోట్ల పైచిలుకు షేర్‌ను రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా కేవలం 13 రోజుల్లోనే 68 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రం దిల్‌రాజుకు ఊహించని విజయాన్ని అందించింది. సినిమా ఓ రేంజ్‌లో సక్సెస్ కావడంతో అనిల్ ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్-3’ అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. వెంకీ, వరుణ్‌తోపాటు సీక్వెల్‌లో మరో స్టార్ హీరో కూడా జాయిన్ కానున్నాడు.