4 లెటర్స్ టీజర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రాన్ని ఆర్ రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో, నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ‘4 లెటర్స్’ టీజర్‌ను దర్శకుడు కె రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవాస భారతీయుడైన చిత్ర నిర్మాత ఉదయ్‌కుమార్ నిర్మించిన ‘4 లెటర్స్’ నేటితరం యువతీ యువకుల మనోభావాలకు అద్దంపట్టేలా ఉందన్నారు. హీరో ఈశ్వర్‌కు ఇది తొలి చిత్రమైనా చక్కగా నటించాడని, పరిశ్రమలో అతనికి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. నిర్మాతలు దొమ్మరాజు హేమలత, ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ తమ బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం ‘4 లెటర్స్’ టీజర్‌ను రాఘవేంద్రరావు విడుదల చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 30న ఆడియో, ఫిబ్రవరి రెండోవారంలో చిత్రం విడుదలవుతాయన్నారు. హీరో ఈశ్వర్ మాట్లాడుతూ కె రాఘవేంద్రరావు హస్తవాసితో సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు ఆర్ రఘురాజ్ మాట్లాడుతూ ‘4 లెటర్స్’ నేటితరం ప్రేమకథాచిత్రం అన్నారు. కుర్రాళ్లకి అర్ధమవుతుందిలే అన్న ఉపశీర్షిక పెట్టామన్నారు.