సంగీతమే హైలైట్‌గా నా హృదయం ఊగిసలాడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావంత్, పావని జంటగా కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్ దర్శకత్వంలో పల్లా రమణయాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, చీరాల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ అంతా పూర్తిచేశామని, సంగీతం హైలెట్‌గా నిలిచే పాటలన్నీ అందరికీ నచ్చుతాయని తెలిపారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలన్నీ భావోద్వేగంగా సాగుతాయని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం తప్పక విజయవంతవౌతుందన్న నమ్మకం వుందని తెలిపారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాసరావు కిలారి, సంగీతం: రాజ్‌కిరణ్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: పళ్లా రమణాయాదవ్, కథ, కెమెరా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధనుంజయ్.