ఎదురీత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కొడుకంటే అమితమైన ప్రేమ. కొడుకు కోరిందేదీ కాదనకుండా ఇస్తుంటాడు. ఆ అతి ప్రేమే ఎన్ని అనర్ధాలు తీసుకొచ్చిందన్న ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం -ఎదురీత. బోగారి లక్ష్మీనారాయణ నిర్మాతగా దర్శకుడు బాలమురుగన్ తెరకెక్కించిన చిత్రం. శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా, మాస్టర్ చరణ్ కొడుకు పాత్రలు పోషిస్తున్నారు. రియోనా లిషోయ్ కథానాయిక. సినిమా చిత్రీకరణ పూరె్తైంది. రిపబ్లిక్‌డే సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్‌వద్ద గోలీసోడా, కడుగు, తెలుగులో ‘10’గా విడుదలైన విక్రమ్, సమంత సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేసిన బాలమురుగన్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడన్నారు. కొడుకు కోసం కన్నతండ్రి ‘ఎదురీత’ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. నిర్మాణానంతర పనులు జరుగుతున్న చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తామన్నారు.