కోలీవుడ్‌పై ఫోకస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనే్సషన్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే తమిళ మార్కెట్‌పై ఫోకస్‌పెట్టాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెలుగు తమిళ చిత్రం ‘నోటా’తో తన లక్కును టెస్టు చేసుకున్నాడు కానీ సినిమా నిరాశపర్చింది. అలాగని విజయ్ ప్రయత్నాలు ఆపడంలేదు. ప్రస్తుతానికి లైన్లోవున్న రెండు సినిమాలు ‘డియర్ కామ్రేడ్’, క్రాంతిమాధవ్ ప్రాజెక్ట్ మాత్రం తెలుగు మార్కెట్ కోసమే చేస్తున్నాడు. కానీ, తర్వాత చేయబోయే ప్రాజెక్టు మాత్రం తమిళ తెలుగు చిత్రమేనని తెలుస్తుంది. ఈమధ్యే కొత్త దర్శకుడు ఒకరు యూనివర్సల్ అప్పీల్ కథ చెప్పి విజయ్‌ను మెప్పించాడట. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న ప్రచారం జరుగుతోంది. లైన్లోవున్న రెండు సినిమాలు పూర్తికాగానే ఆ చిత్రం సెట్స్‌పైకి రానుందట. ‘నోటా’ కోసం తమిళం నేర్చుకొని మరీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న విజయ్, ఈసారి తమిళ భాషపై మరింతగా పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్.