సాహో దర్శకుడితో!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా పేరు సూర్య’ తరువాత కొత్త ప్రాజెక్టును ప్రారంభించలేదు అల్లు అర్జున్. చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ప్రాజెక్టు అయితే మొదలు పెట్టలేదు. ఇటీవల చేసిన సినిమాలు ప్రేక్షకులను సరిగా మెప్పించలేకపోవడంతో, ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో బన్నీ మరింత జాగ్రత్త పడుతున్నాడని అంటున్నారు. త్రివిక్రమ్ సినిమా ఫైనలైజ్ అయినా బన్నీ మాత్రం కథలు వింటున్నాడట. రీసెంట్‌గా యువ దర్శకుడు సుజిత్ స్టైలిష్ స్టార్‌కు ఒక ఇంట్రెస్టింగ్ కథ వినిపించాడట. కథ నచ్చడంతో దాన్ని పూర్తిస్థాయి స్క్రిప్ట్‌గా తీర్చిదిద్దమని బన్నీ సుజిత్‌కు సూచించినట్టు సమాచారం. సుజిత్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సాహో’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతం జోరుగా ప్రీప్రొడక్షన్ జరుపుకుంటోంది. సినిమా పూర్తయ్యేలోపు సుజిత్ కూడా ‘సాహో’ పూర్తి చేసి బన్నీ సినిమాపై ఫోకస్ పెట్టే అవకాశం లేకపోలేదు.