శ్రద్ధగా.. తమిళ పింక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిగ్ బీ అమితాబ్, తాప్సి, కీర్తికుల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రలుగా వచ్చిన బాలీవుడ్ హిట్టు మూవీ ‘పింక్’ను అజిత్‌తో తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. ఇది అజిత్‌కు 59వ సినిమా. దివంగత తార శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మాత. బాలీవుడ్ నటి విద్యాబాలన్ అజిత్‌కు జోడీగా నటిస్తుంటే, తాప్సి పాత్రకు శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేసుకున్నారు. కీర్తికుల్హరి పాత్రలో అభిరామి వెంకటాచలమ్, ఆండ్రియా తరియంగ్ తన పాత్రలో తానే నటిస్తున్నారు. రీమేక్‌కు ‘ఖాకీ’ ఫేం హెచ్ వినోద్ దర్శకుడు. ఫిబ్రవరి నుంచి షూటింగ్‌కు వెళ్తున్న యూనిట్, తమిళ నేటివిటీకి తగ్గట్టు రీమేక్‌లో భారీ మార్పులు చేశారని సమాచారం. ఇదిలావుంటే, తనపై ఇప్పటివరకు వచ్చిన వదంతులు నిజమైనందుకు పిచ్చి హ్యాపీగా ఉందంటోంది శ్రద్ధా శ్రీనాథ్. ‘పింక్’ రీమేక్‌లో శ్రద్ధ కీలక పాత్ర పోషించనుందంటూ కథనాలు వచ్చాయ. మొత్తానికి తాప్సీ పాత్రలో శ్రద్ధకు చాన్స్ దక్కడంతో ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. రూమర్లు నిజమైనందుకు సంతోషంగా ఉంది. నిజానికి కన్ఫర్మ్ అయ్యాక చెబుదామని నేనే కామ్‌గా ఉన్నా. ఇపుడు గర్వంగా ప్రకటిస్తున్నా. ఇప్పటివరకు నేను చేయని ఛాలెంజింగ్ పాత్ర దక్కింది. మాతృకకంటే ఆ పాత్రలో మెప్పించేందుకు నావంతు కృషి చేస్తానని మాత్రం నమ్మకంగా చెబుతున్నానంటోంది శ్రద్ధ.