ఇస్మార్ట్ నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌తో కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. కాగా హీరో రామ్‌కు జోడీ కోసం కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న పూరీ టీం, ఎట్టకేలకు నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. న్యూలుక్‌తో అదరగొడుతున్న రామ్, ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు ఫస్ట్‌లుక్ చూస్తే తెలుస్తోంది. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి, ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ రాజ్‌తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రాన్ని పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ‘మే’లోనే చిత్రాన్ని విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.