కొత్త హుషారొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం ‘హుషారు’. డిసెంబర్ 14న విడుదలై శుక్రవారంతో 50రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మీడియాతో మాట్లాడాడు.
ఈ రోజుల్లో సినిమా 50 రోజులకు రీచ్‌కావడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ‘హుషారు’ ఫిఫ్టీ పూర్తి చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఆరోజు ఓ ఈవెంట్ నిర్వహించి సినిమా ప్రదర్శిస్తున్న 30 థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను కలవబోతున్నాం. సినిమా చేసేటప్పుడే మా టార్గెట్ ఆడియెన్స్ యూత్. టార్గెట్‌ను రీచయ్యామనే అనుకుంటున్నాం.
సినిమాకు బేసిక్ ఐడియా -పాతికేళ్లు వయసులో ఉద్యోగం లేకపోతే యూత్ ఎలా బ్రతుకుతారు? అనేదే. ఈ జనరేషన్‌లో అలాంటిది కుదురుతుందా? లేదా? అనేది సినిమాలో చూపించాం.
అనుకున్న బడ్జెట్ తక్కువే. అయితే అయిన బడ్జెట్ మాత్రం ఎక్కువ. ప్రస్తుతం ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడం కష్టమవుతుంది. వాళ్లకి కొత్త పాయింట్ అనిపిస్తేనే థియేటర్‌కు వస్తున్నారు. జనాలకు నచ్చే కానె్సప్ట్‌తోనే సినిమా చేయాలి. మా సినిమాకు కనెక్టై ఎక్కువసార్లు చూసినవాళ్లు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో సినిమా గురించి పాజిటివ్‌గా కూడా యూత్ రెస్పాన్స్ అయ్యారు.
సినిమాలోని నాలుగు క్యారెక్టర్స్‌లో ఏదోక క్యారెక్టర్‌కు ఆడియన్స్ కనెక్టవుతున్నారు. ప్రేక్షకులే సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. రెండు సినిమా కథలు సిద్ధం చేస్తున్నా. పెద్ద బ్యానర్లతో పని చేయబోతున్నా. ఇండస్ట్రీ నుంచి చాలామంది సినిమా చూసి అప్రీషియేట్ చేశారు. మా సినిమా పెద్ద సినిమాలను తట్టుకుని ముందుకు రావడంతో సినిమాలో కంటెంట్ ఉందని అందరూ మెచ్చుకున్నారు.
‘ఉండిపోరాదే..’ సాంగ్‌కు రథన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు సిద్‌శ్రీరాం ఆ ట్యూన్‌కు అద్భుతమైన గాత్రాన్నిచ్చాడు. ఈ పాట చాలా బావుందని అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేయడం హ్యాపీ అనిపించింది.