నచ్చే బిచ్చగాడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్, నేహా దేశ్‌పాండే, సుమన్ ప్రధాన పాత్రల్లో కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో జి చంద్రశేఖర్ నిర్మించిన ‘బిచ్చగాడా మజాకా’ చిత్రం ఫిబ్రవరి 1న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కెఎస్ నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రమిది. హీరో అనాధ. అతను బిచ్చగాళ్లులేని సమాజాన్ని చూడాలన్న సంకల్పంతో ఉంటాడు. దానికోసం ఏంచేసాడు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బిచ్చగాళ్లు లేకుండా ఎలా చేశాడన్నది కథ. కథను తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి వినిపిస్తే బాగుంది, ప్రొసీడ్ అంటూ ప్రభుత్వం తరఫున ఎంతో సపోర్ట్ అందిస్తున్నారు. ఇందులో హీరోగా అర్జున్ నటిస్తున్నాడు. ఇంతకుముందు అర్థనారి చేశాడు. నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హీరోయిన్‌గా నేహా దేశ్‌పాండే నటిస్తుంది. సుమన్ ప్రధాన పాత్రలో విలన్‌గా కనిపిస్తారు. శివాజీ సినిమా తరువాత ఆ రేంజ్ విలనిజాన్ని ప్రదర్శించారు సుమన్. ట్రైలర్స్, పాటలకు మంచి స్పందన వచ్చింది. కథను నిర్మాత చంద్రశేఖర్ అందించాడు. తప్పకుండా అందరికీ నచ్చేలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఉంటుంది అన్నారు.