మళ్లీ.. సీతారామరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో బ్యానర్‌పై డా శ్రీనివాస్ నిర్మాతగా సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్‌వంటి సామాజిక చిత్రాల, రొమాంటిక్ క్రైమ్‌కథ, క్రిమినల్ ప్రేమకథ వంటి యూత్‌ఫుల్ చిత్రాలు తెరకెక్కించిన పి సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా ‘సీరామరాజు -ఏ ట్రూ వారియర్’ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెల్లదొరల ఆకృత్యాలకు మన్యం నుంచి నిరసన విప్లవ బావుటా ఎగరేసిన పాతికేళ్ల కుర్రాడి పోరాటగాథను ఉత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారు. మార్చిలో షూటింగ్ ప్రారంభవౌతున్న చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి నిర్ణయించారు. చిత్రానికి సహ నిర్మాతలు యెక్కలి రవీంద్రబాబు, డా ఎల్‌ఎన్ రావు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాపిరాజు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ అప్పటి చరిత్రతో ఇప్పటి యువతలో స్ఫూర్తినింపేలా సీతారామరాజు కీర్తి ఇనుమడించేలా ఏ ట్రూ వారియర్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఏపీలో పూర్తి పోస్ట్‌ప్రొడక్షన్ వసతులతో తొలి స్టూడి ఏర్పాటు చేసిన రిసాలి ఫిల్మ్ స్టూడియో అండ్ అకాడమీ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం చేపడతామన్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏజెన్సీ పరిసరాల్లో సింహభాగం షూటింగ్ జరుపుకునే చిత్రానికి సీనియర్ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుంది. నూతన నటీనటులతో పాటు సీనియర్ నటీనటులు కూడా ఇందులో నటిస్తారు. మార్చిలో షూటింగ్ ప్రారంభవౌతున్న చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం నేపథ్యంలో సాగే చిత్రంలో సీజీ వర్క్ ఇప్పటికే జరుగుతోంది. చరిత్రకారుల సహకారంతో సీతారామరాజు మరణానికి సంబంధించిన మిస్టరీనీ చిత్రంలో చూపించనున్నాం. త్వరలో సాంకేతిక నిపుణులు, నటీనటుల పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు.