పవన్ కోసం రెండేళ్లు వెయట్ చేసా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంపత్‌నంది. రామ్‌చరణ్‌తో రచ్చ చిత్రాన్ని రూపొందించి కమర్షియల్‌గానూ ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘బెంగాల్‌టైగర్’. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు సంపత్‌నందితో ఇంటర్వ్యూ..
* బెంగాల్ టైగర్ ఎలా వుంటుంది?
ఈ సినిమాకు బెంగాల్ టైగర్ అనే టైటిల్ పెట్టడంతో అందరూ కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో వుంటుందని అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా కలకత్తా బ్యాక్‌డ్రాప్ వుండదు. దాంతోపాటు హీరో పోలీసు కూడా కాదు. ఇది తెలుగు నేటివిటీకి చెందిన ఆత్రేయపురం అనే ఊరిలో జరిగే కథ.
* రవితేజతో పనిచేయడం?
- రవితేజ ఎనర్జీ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన ఎనర్జీ లెవెల్స్‌ను పెంచే సినిమా ఇది. టైటిల్ ఆయనకు సరిపోతుందని, కథ ప్రకారమే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. రవితేజతో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా వుంటుంది. ఈ సినిమాలో ఆయన లుక్‌కాని, స్టైల్‌గాని కొత్తగా వుంటాయి.
* రచ్చ తరువాత ఇంత గ్యాప్ రావడానికి కారణం?
- పరిశ్రమలో పరిస్థితులు తారుమారు అవుతుంటాయి. రచ్చ సినిమా తరువాత పవన్‌కళ్యాణ్‌గారితో సినిమా చేయడానికి రెడీ అయ్యాను. కానీ దానికోసం రెండున్నర సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. పరిస్థితుల ప్రభావంవల్ల ఆ సినిమానుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే బెంగాల్ టైగర్ ఓకె కావడంతో ఈ సినిమా చేశాను.
* ప్రస్తుతం పవన్‌తో ఎలాంటి రిలేషన్ వుంది?
- నాకు పవన్‌కుమధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేము సినిమా అనుకున్న సమయంలో ఎలాంటి పరిచాయలు ఉన్నాయో ఇప్పటికీ అలాగే వుంది. ఖచ్చితంగా ఆయనతో త్వరలోనే సినిమా చేస్తా.
* బెంగాల్ టైగర్ కథ పవన్‌కోసమే అనుకున్నారా?
- లేదండీ. నిజానికి ఈ కథను రవితేజగారికోసమే రెడీ చేసుకున్నాను. పవన్‌కళ్యాణ్‌కు చెప్పింది వేరే కథ. అయితే టైటిల్ మాత్రం పవన్‌కోసమే అనుకున్నాను. ఈ విషయం ఆయనకు కూడా తెలియదు.
* హీరోయిన్ల గురించి?
- ‘రచ్చ’ తరువాత మళ్లీ తమన్నాతో చేస్తున్న సినిమా ఇది. ఇందులో కథ ప్రకారం బాగా తెలిసిన హీరోయిన్ వుంటే బాగుంటుందని తమన్నాతో చేయించాం. తను బాగా చేసింది. అలాగే మరో ముఖ్యపాత్రకు రాశీఖన్నాను ఎంపిక చేశాం. ఇద్దరూ చాలా బాగా నటించారు. సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో ఇద్దరిదీ ముఖ్యపాత్రే.
* మిగతా నటీనటుల గురించి?
- ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బొమన్ ఇరాని నటించారు. విలన్ పాత్రను కొత్తగా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
* ఆడియో రెస్పాన్స్ ఎలా వుంది?
- ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించారు. తను నా మొదటి సినిమా ఏమైంది ఈవేళ సినిమాకు కూడా సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు మంచి హిట్ అయి సినిమాపై అంచనాలను పెంచింది.
* హైలెట్స్ గురించి?
-ఈ సినిమాలో హైలెట్‌గా చెప్పాలంటే రవితేజ నటన, ఆయన ఎనర్జీ కొత్తగా వుంటుంది. దాంతోపాటు ఇంటర్‌వెల్ ఫైట్ మరో హైలెట్‌గా నిలుస్తుంది. దాంతోపాటు ఫొటోగ్రఫి, పాటలు. ముఖ్యంగా మా నిర్మాత రాధామోహన్‌గారి సహకారంతో ఈ సినిమా భారీగా రూపొందించడం జరిగింది.
* పవన్ సినిమా ఆగిపోవడానికి కారణం?
- పవన్‌తో సినిమా చేయడానికి అన్నిరకాలుగా ప్రిపేర్ అయ్యాము. దాదాపు రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. దానికి కారణం పరిస్థితులే. ఇక్కడ పరిస్థితులన్నీ ఆయా సమయాలను బట్టి మారిపోతూంటాయి.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతానికి ఇంకా ఏదీ కమిట్ కాలేదు. ‘బెంగాల్ టైగర్’ సినిమా రిలీజ్ తరువాత ఎవరితో చేస్తాననేది తెలియజేస్తా. కానీ ఖచ్చితంగా మరో కమర్షియల్ సినిమాని చేస్తా.