అప్పుడొస్తున్నాడు.. దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ‘దేవ్’ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలకానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఆడియోకి విశేష స్పందన లభించడం తెలిసిందే. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాకి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఖాకీ’లాంటి సూపర్ హిట్ తర్వాత రకుల్‌ప్రీత్‌సింగ్, కార్తీ కాంబోలో వస్తున్న చిత్రమిది. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ పవర్‌ఫుల్ రోల్స్‌లో నటిస్తుంటే, నిక్కీ గల్రాని మరో కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల పూర్తయ్యాయని, తెలుగు, తమిళ భాషల్లో ఒకే సమయంలో సినిమా విడుదల కానుందని యూనిట్ చెబుతోంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తున్న సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్‌టైనె్మంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.