లీకైన ‘మహర్షి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షూటింగ్ టైంలో జనం అత్యుత్సాహం ఒక్కోసారి కొంపముంచుతుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘మహర్షి’కి అదే ఎదురైంది. కథానాయకుడి స్పెషల్ లుక్ విడుదల చేయాల్సిన అవసరం లేకుండానే -‘మహర్షి’ ఫొటోలను ఫ్యానే్స విడుదల చేసేశారు. తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చిలో జరుగుతున్న షూటింగ్ చివరి రోజున ఈ పరిస్థితి ఎదురైనట్టు తెలుస్తోంది. తాజాగా పొలాలమధ్య మహేశ్ నడుచుకుంటూ వెళ్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో గుమిగూడిన జనం తీసిన వీడియో కూడా ఒకటి ఆన్‌లైన్‌కు ఎక్కేసింది. రూరల్ బ్యాక్‌డ్రాప్ సీన్ చిత్రీకరిస్తున్న టైంలో ఎగబడిన జనాలను అదుపుచేయలేని స్థితిలో యూనిట్ సభ్యులు అలాగే షూటింగ్ నిర్వహించారట. ఆ టైంలో ఓ వ్యక్తి షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. దీంతో గుబురు గడ్డంతోవున్న మహేశ్ లుక్‌ను యూనిట్ విడుదల చేయాల్సిన అవసరం లేకుండానే బయటికొచ్చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జెమినీ దక్కించుకుంది. తమిళనాడులోని పొల్లాచిలో తొలి షెడ్యూల్ పూరె్తైందని, తర్వాతి షెడ్యూల్ ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మొదలవుతుందని, చివరి షెడ్యూల్ అబూధాబీలో చేయనున్నట్టు యూనిట్ చెబుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది.