1న ‘సకల కళావల్లభుడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరం సుధాకర్‌రెడ్డి సమర్పణలో సింహా ఫిలిమ్స్, దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం -సకల కళావల్లభుడు. తనిష్క్‌రెడ్డి, మేఘ్లా ముక్తా హీరో హీరోయిన్లు. శివగణేష్ దర్శకత్వం వహించిన చిత్రం 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాతలు అనిల్, శ్రీకాంత్ మాట్లాడుతూ యాక్షన్, కామెడీల మేళవింపుతో సకల కళావల్లభుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్ ముందుకు వస్తున్నాడన్నారు. టైటిల్‌ను జస్టిఫై చేస్తూ హీరో తనిష్క్‌రెడ్డి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, ఫ్యూచర్‌లో తనిష్క్‌తో మరిన్ని సినిమాలు చేస్తామన్నారు. దర్శకుడు శివగణేష్ మాట్లాడుతూ సినిమా పూరె్తైన తరువాత అందరిలో నమ్మకం పెరిగిందన్నారు. అందుకు నిర్మాతల సపోర్ట్, హీరో తనిష్క్‌రెడ్డి పెర్ఫార్మెన్స్ అన్నారు. హీరో తనిష్క్‌రెడ్డి మాట్లాడుతూ కథలో కంటెంట్ ఉంటే ఆదరించి సపోర్ట్ చేసే సినిమా పెద్దలు చాలామందే ఉన్నారు. అలా బీరం సుధాకర్‌రెడ్డి, నిర్మాతలు అనిల్, శ్రీకాంత్‌లు తోడై ఖర్చుకు వెనుకాడకుండా రిచ్‌గా తెరకెక్కించారు. టెక్నీషియన్స్ విజయ్, నాని, ధర్మేంద్రలు బెస్ట్ వర్క్‌ను అందించారు. మ్యూజిక్ అందించిన అజయ్ గురించి చెప్పాల్సిన పని లేదు. సినిమాను భారీగా విడుదల చేస్తున్నామని, ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. నటుడు రాజేంద్రకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్, నటి అలెక్సా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.