థ్రిల్లర్ కథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాట్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో అవసరాల శ్రీనివాస్, రణధీర్ ముఖ్య పాత్రల్లో రాజేష్ నాందెడ్ల దర్శకత్వంలో నరేందర్‌రెడ్డి, చుక్కా శర్మ నిర్మిస్తున్న చిత్రం కథనం. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా రామానాయుడు స్టూడియోస్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ కథను నడిపించే కథనం టైటిల్‌తో వస్తున్న సినిమాలో మంచి పాత్ర చేస్తున్నా. ఇందులో భిన్నమైన పాత్ర. అసోసియేట్ డైరెక్టర్‌గా కనిపిస్తాను. సరికొత్త థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. దర్శకుడు రాజేష్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. క్షణం, రంగస్థలం తరువాత ఆ రేంజ్‌లో క్రేజ్ తెచ్చే పాత్ర అన్నారు. రణధీర్ మాట్లాడుతూ ధ్రువ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్నా. అనసూయతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు. నిర్మాత నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ నేను డిస్ట్రిబ్యూటర్‌గా నెల్లూరులో పలు చిత్రాలను పంపిణీ చేశాను. నిర్మాతగా మా మిత్రుడితో కలిసి మంగళ సినిమా తీశా. సోలోగా ఈ సినిమాతో మీముందుకు వస్తున్నాను. దర్శకుడు రాజేష్ చెప్పిన కథ చాలాబాగా నచ్చింది. అందుకే సినిమా తీస్తున్నా. అన్నిరకాల కమర్షియల్ హంగులున్న చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేస్తామన్నారు. దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ సరికొత్త థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుందన్నారు.