అక్కడున్నది ఎవడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ కంఠంనేని టైటిల్ పాత్రగా రూపొందిన చిత్రం -అక్కడొకడుంటాడు. శ్రీపాద్ విశ్వక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరో హీరోయిన్లుగా రామ్‌కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞదీపిక నటిస్తుంటే, ఇతర ప్రధాన పాత్రల్లో అల్లరి రవిబాబు, వినోద్‌కుమార్, ఇంద్రజ కనిపించనున్నారు. లైట్‌హౌస్ సినీమ్యాజిక్ బ్యానర్‌పై కె శివశంకర రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మించిన చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. సీనియర్ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్ ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని నిర్మాత సి కల్యాణ్‌కు అందించారు. సి కల్యాణ్ మాట్లాడుతూ వారంవారం పదివరకూ చిన్న సినిమాలు వస్తున్నా, వాటిలో ఒకటికాకుండా ప్రత్యేక సినిమాగా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కార్లలో తిరిగే మందుబాబుల ఆగడాల వల్ల జరిగే అనర్థాలను చిత్రంలో చూపించారన్నారు. సినిమా చూస్తున్నంతసేపూ తరువాత ఏంటి? అన్న ఆసక్తి కలిగేలా ఉందన్నారు. వల్లభనేని జనార్దన్ మాట్లాడుతూ చిత్ర నిర్మాతలతో తనకు 30ఏళ్ల అనుబంధం ఉందని, మంచి అభిరుచితో విభిన్న చిత్రం నిర్మించటం అభినందనీయమన్నారు. టైటిల్ పాత్రధారి శివ కంఠంనేని మాట్లాడుతూ ఎవడు ఎక్కడుంటాడు? ఎందుకుంటాడు? అన్న ప్రశ్నలకు జవాబులు అక్కడొకడుంటాడు? చిత్రంలోనే తెలుస్తాయన్నారు. నటుడు అల్లరి రవిబాబు మాట్లాడుతూ ఫ్యాషన్‌తో చిత్ర నిర్మాతలు సినీరంగంలోకి వచ్చారని, నిర్మాణంలో వారు పాటించిన క్రమశిక్షణ, అంకితభావం తనకెంతో ముచ్చట కలిగించిందన్నారు. నిర్మాత రావుల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ పైరసీకి వెళ్లకుండా ప్రేక్షకులు కేవలం థియేటర్‌లో చూస్తేనే చిత్రంలోని సాంకేతిక నైపుణ్యం తెలుస్తుందన్నారు. దర్శకుడు శ్రీపాద్ విశ్వక్ మాట్లాడుతూ కానె్సప్ట్ ఓరియంటెడ్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా సినిమా ఆద్యంతం అలరిస్తుందన్నారు.