‘4 లెటర్స్’లో ప్రేమ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా ఆర్ రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం 4 లెటర్స్. ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పాటల సీడీని విడుదల చేసారు. కార్యక్రమంలో నిర్మాత అచ్చిరెడ్డి, జెమినీ కిరణ్, శివాజీరాజా, నటుడు సురేష్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ చక్కని టైటిల్ అని, ప్రేమ అనకుండా 4 లెటర్స్ అని కొత్తగా పెట్టారన్నారు. పాటలు బాగున్నాయ్. తప్పకుండా సినిమా పరిశ్రమకు ఇప్పుడు కొత్త టాలెంట్ అవసరం. ఈమధ్య భిన్నమైన సినిమాలు సూపర్‌హిట్స్ అందుకుంటున్నాయి. అలాగే సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాతో తమ అబ్బాయిని హీరోగా చూడాలనుకున్న ఉదయ్ కల నెరవేరుతుంది. తప్పకుండా సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానన్నారు. శివాజీరాజా మాట్లాడుతూ సినిమా తీయాలన్న ఆశ కలిగిందంటే అది ఎక్కడున్నా వదిలిపెట్టదు, సినిమా చేసేలా చేస్తుంది.. అలాగే మేమూ ఎక్కడెక్కడినుండో వచ్చాము. నిర్మాత ఉదయ్ కూడా సినిమామీద ప్యాషన్‌తో వచ్చాడు. ఇలాంటి నిర్మాతల వల్లే ఈరోజు సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ సంతోషంగా ఉంది. ఇలాంటి నిర్మాతలు రావాలి. తప్పకుండా 4లెటర్స్ మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాత ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ ‘మా బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం ‘4 లెటర్స్’. ఈ చిత్రం టీజర్‌ను రాఘవేంద్రరావు విడుదల చేయటం, అది మంచి క్రేజ్ తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ద్వారా ఈశ్వర్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. కమర్షియల్ హంగులతో యూత్‌సహా అన్నీ వర్గాలను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందించాం. ఫిబ్రవరి 2వ వారంలో చిత్రం విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు ఆర్ రఘురాజ్ మాట్లాడుతూ ‘కలుసుకోవాలని’ తర్వాత తెలుగులో నేను డైరెక్ట్‌చేసిన మూవీ 4 లెటర్స్. ప్రేమ, పెళ్లి విషయాల్లో నేటితరం యువత ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటన్నది చిత్రీకరించటం జరిగింది. కథ, కథనాలు ఆలోచన రేకెత్తించేలా ఉంటాయన్నారు.