బాషా డైలాగే ఆ సినిమా పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.వి.ప్రకాష్‌కుమార్, ఆనంది జంటగా లైకా ప్రొడక్షన్స్ పతాకంపై శ్యామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాకు ఇంకోపేరుంది’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, బాషా చిత్రంలో రజనీకాంత్ చెప్పిన డైలాగే సినిమాకి పేరుగా నిర్ణయించామని, యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం యువతకు నచ్చుతుందని తెలిపారు. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈ సినిమాకు పెట్టిన పేరుకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. అందమైన ప్రేమకథకు మంచి సంగీతం తోడైతే ఎలా వుంటుందో తమ చిత్రం నిరూపిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందుతోందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణవసంత్, ఎడిటింగ్: రూబెన్, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, కథ, దర్శకత్వం: శ్యామ్ ఆంటోన్.