యమ్ 6’ట్రీమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జైరామ్‌వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ తన్నీరు నిర్మిస్తున్న హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘యమ్ 6’. ఫిబ్రవరి రెండోవారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ధ్రువ హీరోగా పరిచయమవుతున్నాడు. చిత్ర విశేషాలను ధ్రువ వెల్లడిస్తూ, ‘యమ్ 6’ వంటి మంచి సినిమా ద్వారా హీరోగా పరిచయమవ్వడం ఆనందంగా ఉంది. నటుడిగా నాకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలన్నది చిరకాల కోరిక. నిర్మాత విశ్వనాథ్ అంతా కొత్తవారితో సినిమా నిర్మించబోతున్నారని తెలిసి కలిశాను. చిన్న సస్పెన్స్ తరువాత నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. వెంటనే షూటింగ్ మొదలైపోయింది. కొత్త హీరోలాకాకుండా సొంత తమ్ముడిలా చూసుకున్నారు. డైరెక్టర్ జైరామ్‌వర్మ అన్ని విషయాల్లో సహకారం అందించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఇబ్బందిలేకుండా నటించా. మంచి కథ, కథనాలతో వర్మ తెరకెక్కించిన చిత్రం అద్భుతం. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మొదటి సినిమాలోనే వైవిధ్యమైన పాత్ర పోషించటం పట్ల హ్యాపీగా ఉంది. ఇకపైనా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నేను నటించిన మొదటి సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ విడుదల చేయడం మరచిపోలేని అనుభూతి. ‘యమ్6’ చిత్రాన్ని, హీరోగా నన్నూ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.