ఈ ఫేజ్ హ్యాపీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవ్యసాచితో టాలీవుడ్‌కు పరిచయమై, ‘మిస్టర్ మజ్ను’తో సత్తా చూపించింది నిధి అగర్వాల్. చాలెంజింగ్ పాత్రల్లో నటించాలని ఉందంటున్న నిధి, ‘మిస్టర్ మజ్ను’ రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉందట. చైతన్య, అఖిల్‌తో వరుస సినిమాలు చేయడం లక్కీగా ఫీలవుతున్నానంటోంది. మజ్నులోని ఏమోషనల్ సీన్స్‌లో నా పెర్ఫార్మెన్స్‌కి మంచి అప్లాజ్ వస్తుందని, పెర్ఫార్మెన్స్ చూశాక పేరెంట్స్ అయతే నువ్వింత బాగా యాక్ట్‌చేస్తావా...? అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ ప్రశంసించారని చెబుతోంది. నేను పుట్టింది హైదరాబాద్‌లోనే కాబట్టి తెలుగు మాట్లాడటం అంత కష్టంకాదు. ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏదో కొత్తగా వింటున్న లాంగ్వేజ్‌లా అనిపించలేదు. ఇక నా ఫేస్ కొంచెం ఇన్నోసెంట్, కాబట్టి దానికి తగ్గట్టే రోల్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఈ ఫేజ్‌కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నా. డ్యాన్స్ ఓరియంటెడ్ సినిమా చేయాలని ఉంది. ఇదే నా కెరియర్ బిగినింగ్ కాబట్టి ఇంకా నేను నాకు నచ్చిన రోల్సే చేసే స్టేజ్‌కి వచ్చానని అనుకోవట్లేదు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ తరవాత, డిఫరెంట్ రోల్స్‌పై దృష్టిపెడతా. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో నటిస్తున్నందుకు చాలా హ్యాపీ. ఆ రోల్ గురించి ఇప్పుడే చెప్పను. కానీ చాలా కొత్త క్యారెక్టర్‌లో కనిపించబోతున్నా. ప్రస్తుతం ఆఫర్స్ వస్తున్నాయి కానీ తొందరపడదలుచుకోలేదు. ఇప్పటివరకు జస్ట్ ‘మిస్టర్ మజ్ను’పైనే ఫోకస్‌పెట్టాను. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’. బెస్ట్ అనిపించినదే చేద్దామనుకుంటున్నాను. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేద్దామనుకుంటున్నాను. నెగెటివ్ కామెంట్స్‌ని కూడా చాలా పాజిటివ్‌గా తీసుకుంటా. కానీ ఆ కామెంట్స్ ఎవరు చేస్తున్నారనేది మాత్రం డెఫినెట్‌గా మ్యాటర్స్. కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ పర్సన్స్‌నుండి వచ్చిన కామెంట్స్‌నే పట్టించుకుంటా. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా 4సార్లు చూశాను. ఒకవేళ అవకాశం దొరికితే అలాంటి రోల్‌లో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది నిధి.