హిందీలో సర్దార్ హంగామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పవన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతోపాటు హిందీలో ఈనెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్లామర్ భామ కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన హిందీ ప్రమోషన్ పనులు మొదలయ్యాయి. హిందీలో అత్యంత భారీ స్థాయిలో దాదాపు 800 థియేటర్లలో విడుదల చేస్తున్నారట. ఇప్పటికే ట్రైలర్స్, పోస్టర్స్‌తో నార్త్‌లో దుమ్మురేపుతున్నారు. పవన్ స్నేహితుడు శరత్‌మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేస్తోంది. మరోవైపు హిందీ శాటిలైట్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయట. తెలుగులోనూ భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని, కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉంటాయని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. సర్దార్‌తో ఉత్తరాది ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు పవన్.

చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్‌లో
పవన్‌కళ్యాణ్