విశాల్‌తో రొమాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో అగ్రతారగా వెలుగుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్ అంతకంటే ముందు తమిళ చిత్రసీమలో కొన్ని సినిమాలు చేసింది. నటుడు అరుణ్ విజయ్‌కు జంటగా ‘తడైయారు తాక్క’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైన రకుల్‌ప్రీత్‌సింగ్ ఆ తరువాత ‘పుత్తగమ్’, ‘ఎన్నమో ఏదో’ వంటి సినిమాలలో నటించినా అవి తనకు అనుకున్నంత గుర్తింపుతెచ్చి పెట్టలేదు.
ఆ తరువాత తను నటించిన తెలుగు సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఘన విజయం సాధించడంతో తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పుడు అగ్రతారగా వెలుగొందుతున్నది. కానీ తను తమిళ సినిమాలలో నటించాలనే కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు తమిళ్ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి తనతో సంప్రదింపులు జరిపారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మిష్కిన్ చిత్రాల్లో కథానాయకులతో కథానాయిలకు కూడా ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలుసుకున్న రకుల్ ఈ సినిమా చేయడానికి అంగీకరించారని తెలుస్తున్నది. విశాల్ స్వంతంగా తన ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై నిర్మించబోతున్న ఈ సినిమా ఓ సోషియో ఫాంటసీ అని సమాచారం. విశాల్ ప్రస్తుతం నటిస్తున్న ‘మరుదు’ సినిమా షూటింగ్ తరువాత ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలిసింది.