నటనపైనే ఫోకస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ కంఠంనేని టైటిల్ పాత్రలో రామ్‌కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞదీపిక హీరోహీరోయిన్లుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం అక్కడొకడుంటాడు. ఇటీవల విడుదలైన సినిమా సూపర్‌హిట్ టాక్‌తో రన్ అవుతున్న నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో టైటిల్ పాత్రధారి శివ కంఠంనేని మాట్లాడారు. చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం హ్యాపీగా ఉందని, బావున్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. సినిమా విడుదలై మొదటి వారం విజయవంతంగా పూర్తయిందని, కొత్తదనానికి పట్టంకడుతున్న నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసిన చిత్రమిదన్నారు. సినిమాలో నా పాత్ర అంధుడిగా ఉన్నాఅద్భుతంగా చేశానని ఆడియన్స్ ప్రశంసించడం మరచిపోలేని అనుభూతి. ఇకపై నటుడిగా భిన్నమైన పాత్రలు చేయాలని ఉంది అన్నారు. 1992నుంచే ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్టు చెప్పారు. పలు టీవీ సీరియల్స్ చేశానని, 15 నంది అవార్డ్స్ వచ్చాయన్నారు. మధ్యలో బిజినెస్ రంగంలో బిజీ అవ్వడంతో సినిమాలు చెయ్యలేదని, ఇకపై నటుడిగా కొనసాగాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు.