యశ్.. రికార్డు గని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటవారసత్వం రాజ్యమేలే పరిశ్రమలో వారసుల్ని సైతం వెనక్కినెట్టి ఇండస్ట్రీ బెస్ట్ రికార్డు అందుకున్నాడు యశ్. ఒక సాధారణ డ్రైవర్ కొడుకు స్వయంకృషితో సాధించిన ఘనత భారతీయ సినీ చరిత్రలో సంచలనం. ప్రస్తుతం అతడు డ్రైవర్ కొడుకు మాత్రమే కాదు, ఇండస్ట్రీ నెంబర్‌వన్ హీరోగా ఎదిగాడు. యశ్ పేరు చెబితే కన్నడ పరిశ్రమ షేక్ అవుతోంది. శివరాజ్‌కుమార్, రాజ్‌కుమార్‌ల శకంపోయి యశ్ టైమ్ మొదలైందా? అన్నంత చర్చ జరుగుతోంది. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు -ఒక్క సినిమా యశ్ దశ తిప్పేసింది. కెజిఎఫ్ ఛాప్టర్ 1 సంచలన విజయం సాధించి ప్రస్తుతం యశ్‌ని ఇంటర్నేషనల్ స్టార్‌ని చేసేసింది. ఈ సినిమా ముగింపు కలెక్షన్ల లిస్ట్ ఇంకారాలేదు. అంతకుముందే దాదాపు 243 కోట్లు వరల్డ్ వైడ్ వసూళ్లు సాధించినట్టు రిపోర్టు. కేవలం 50రోజుల్లో సాధించిన వసూళ్లు ఇవి. కెజిఎఫ్ 1 ఇంకా వసూళ్లు సాగిస్తూనే వుంది. కేవలం ఒక్క కర్నాటకలోనే వసూలు చేస్తోందా? అంటే అన్నిచోట్లా అదే హవా. కర్నాటకలో బాహుబలి 2 చిత్రం సుమారు 100 కోట్లు వసూలు చేస్తే, ఆ రికార్డును బ్రేక్ చేస్తూ కేజీఎఫ్ చిత్రం ఏకంగా 137 కోట్లు వసూళ్లు సాధించిందని ట్రేడ్ టాక్. బహుబలి తర్వాత మళ్లీ ఆ క్రేజ్ ఓ సౌత్ సినిమాకే దక్కిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కర్ణాటకలో కోలార్ బంగారు గనుల్లో బానిసత్వం మాఫియా అన్న ఎలిమెంట్ ఇంత పెద్ద రేంజ్‌లో వర్కవుట్ అవుతుందని మేకర్స్ ఊహించి ఉండరు. కెజిఎఫ్ ఛాప్టర్ 2 చిత్రం ప్రస్తుతం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో సంజయ్‌దత్ విలన్‌గా నటించనున్నారని సమాచారం.