మే 6న బ్రహ్మోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు కథానాయకుడిగా పివిపి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే 6న విడుదలకు సిద్ధమవుతోంది. సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రధాన తారాగణంతో పతాక సన్నివేశాలను ఆర్‌ఎఫ్‌సిలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈనెల 10కల్లా టాకీపార్ట్ మొత్తం పూర్తిచేసి పూనెలో పాటల చిత్రీకరణ జరపనున్నామని, మే 6న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నామని అన్నారు. ఎక్కడైనా నలుగురు వున్నచోట ఓ అందం, ఆనందం వుంటుందని, అలాంటి అనేకమంది ఒక కుటుంబంలో వుండి ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకుంటుంటే అదే బ్రహ్మోత్సవం అన్న కానె్సప్టుతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా వుంటుందని ఆయన అన్నారు. సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఆర్.రత్నవేలు, సంగీతం:మిక్కీ జె మేయర్, ఎడిటింగ్:శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు:పెరల్ వి.పొట్లూరి, పరం వి.పొట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీకాంత్ అడ్డాల.