పెళ్లి చేసుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఫిదాచేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవికి మంచి డిమాండ్ ఉంది సౌత్‌లో. ఆచితూచి సినిమాలకు కమిట్ అవుతోంది. ప్రస్తుతం ఈమె దృష్టి ఎక్కువగా తమిళ సినిమాలపై ఉన్నట్టుంది. ఇక్కడ ఒకటి చేస్తే అక్కడ రెండు చేస్తోంది. వరుస చిత్రాలతో బిజీగావున్న ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోనంటూ తేల్చి చెప్పింది. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం తల్లిదండ్రులకు తోడుగా ఉంటానంటోంది. పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులను విడిచి ఉండాల్సి వస్తుందేమో, సంరక్షణ పూర్తిగా చూసుకోలేనేమోననే భయం ఉందట. నాకు అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. మా సంతోషకరమైన ఫ్యామిలీలో మరొకరు దూరడం నాకు ఇష్టంలేదు. కొత్తగావచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో, అతడివల్ల నా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారోలేదోననే అనుమానం నాకు ఉంది. అందుకే పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం మంచిపద్ధతే కానీ అందుకోసం పెళ్లి వద్దనుకోవడమేంటి? అంటున్నారు.