వాస్తవ సంఘటనల విశ్వమిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా విశ్వామిత్ర చిత్ర కథ అని దర్శకుడు రాజ్‌కిరణ్ అన్నారు. ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన అన్నారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజ్‌కిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్, రాజ్‌కిరణ్ నిర్మిస్తున్న సినిమా విశ్వామిత్ర. నందితారాజ్, సత్యం రాజేష్, అశుతోష్ రానా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గీతాంజలి, త్రిపుర వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజ్‌కిరణ్ దర్శకత్వం వహించారు. దర్శకుడు రాజ్‌కిరణ్ మాట్లాడుతూ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది అన్నారు.