వెంకీ కాంప్లిమెంట్ హ్యాపీనిచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో ఉదయ్‌కుమార్ దొమ్మరాజు 4 లెటర్స్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా యంగ్ హీరో ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు... ఆ విశేషాలు.
గతేడాది వైజాగ్ సత్యానంద్ వద్ద యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఆ ఇద్దరూ అనే షార్ట్ ఫిలింలో నటించాను. దర్శకుడు రఘురాజ్ ఫుల్ స్క్రిప్ట్‌తో వచ్చి కలిశారు. ఫస్ట్ సిటింగ్‌లో అందరికీ నచ్చడంతో ఓకె చేశాం. రెండు నెలలు వర్క్‌షాప్ పెట్టి మా అందరికీ శిక్షణ ఇప్పించారు. ఆ మొదటి సినిమా బెస్ట్ డైరెక్టర్‌తో చేశానన్న సంతృప్తి ఉంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది? అన్న కథాంశానికి లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి 4 లెటర్స్ సినిమాను తెరకెక్కించారు మా దర్శకుడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమాటోగ్రఫి, గణేష్ కొరియోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇందులో ఒక పాట కూడా పాడాను. వెంకటేష్‌గారికి ట్రైలర్ చూపించాం. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కచ్చితంగా నాతోపాటు కొత్తవాళ్లకు అవకాశాలు కల్పిస్తూ మా బేనర్‌లో సినిమాలు చేస్తాం అన్నారు.