చిక్‌మగళూర్‌లో తిరుపతి సెట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాగార్జున. ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’ చిత్రాలు మంచి విజయం సాధించడంతోపాటు నాగార్జునకు మరింత ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. ‘ఊపిరి’ సినిమాలో నటనకుగాను ఆయనకు మంచి అప్లాజ్ దక్కింది. ఈ సినిమా తరువాత నాగార్జున చేసే భక్తి సినిమాకు అప్పుడే సన్నాహాలు జోరందుకున్నాయి. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే వేంకటేశ్వరస్వామి మహాభక్తుడు హాదీరామ్ బాబా జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 17వ శతాబ్దంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుందట. దానికోసం ప్రస్తుతం లొకేషన్ల అనే్వషణలో వుంది చిత్ర యూనిట్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లొకేషన్లను అనే్వషించగా, కర్ణాటకలోని దక్షిణాది ప్రాంతమైన చిక్‌మంగుళూర్ అడవుల్లో కొన్ని ప్రదేశాల్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. 17వ శతాబ్దపు కథ కావడంతో దానికి తగ్గట్టుగా అక్కడ తిరుపతి సెట్ వేయనున్నారట. ఈ చిత్రానికి ‘ఓం నమో వేంకటేశాయ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సుమన్ వేంకటేశ్వరస్వామిగా కనిపిస్తాడని, ఈ చిత్రాన్ని మే నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిసింది.