ఒకింత రొమాంటిక్‌గా.. 118

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కల్యాణ్‌రామ్, నివేద థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా కెవి గుహన్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ -118. చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కార్యక్రమంలో కల్యాణ్‌రామ్, నివేద, దర్శకుడు కెవి గుహన్‌తోపాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెవి గుహన్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ తెలుగులో పలు చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన తనకు దర్శకుడు కావాలని కోరిక కలిగిందని, ఈనేపథ్యంలో ఓ కథను సిద్ధం చేసుకుని కల్యాణ్‌కు వినిపించానన్నారు. కల్యాణ్‌కు కథ నచ్చడంతో సినిమాను మొదలుపెట్టామని, ప్రాజెక్టులోని ప్రతి టెక్నీషియన్ తనకు ఎంతో సహకరింరని అన్నారు. ప్రేక్షకుల ఆశీర్వాదంపై నమ్మకంతోనే ముందడుగు వేస్తున్నామని, రొమాంటిక్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్‌ని అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు. ట్రైలర్‌లోనే కథపై ఓ అంచనాకు రావొచ్చని అంటూ, పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కోనేరు మహేష్, కల్యాణ్, నివేద, షాలినికి కృతజ్ఞతలు తెలిపాడు. హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘కథ వింటున్నపుడే చేయాలన్న కుతూహలం కలిగిందని, ముఖ్యంగా దీన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో చేయాలని అనుకున్నామన్నారు. అయితే కొత్త ఆలోచనలతో వచ్చిన మహేష్ కోనేరు చేస్తేనే బావుంటుదన్న ఆలోచనతో ఆ బ్యానర్‌లో చేశామని, మహేష్ కూడా తమ ఫ్యామిలీ మెంబరేనన్నారు. దర్శకుడు గుహన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదని, ఇప్పటికే ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన గుహన్, దర్శకుడిగా సన్నివేశాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దాడన్నారు. ఈ చిత్రం మీకో కొత్త అనుభూతి అందిస్తుంది అన్నారు. నిర్మాత మహేష్ మాట్లాడుతూ మంచి చిత్రాన్ని మా బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన కల్యాణ్‌రామ్, దర్శకుడు గుహన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందన్నారు. హీరోయిన్ నివేద థామస్ మాట్లాడుతూ ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి సపోర్ట్ చేసిన కల్యాణ్‌రామ్, దర్శకుడు గుహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంచి చిత్రాన్ని ఆడియన్స్ తప్పకుండా విజయవంతం చేయాలని కోరారు.