మళ్లీ శీనుతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌పై మళ్లీ ఫోకస్ పెట్టింది. ఆమధ్య కాస్త గ్యాప్ రావడంతో తమిళంలో సినిమాలు చేసిన రకుల్, ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమైంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో మరోసారి జొడీ కట్టనున్నట్టు సమాచారం. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దాదాపు అన్ని సినిమాలూ స్టార్ హీరోయిన్లతోనే చేస్తుండటం తెలిసిందే. తాజాగా అతని ప్రాజెక్టులోకి మరోసారి క్రేజీ హీరోయిన్ రకుల్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో కోలీవుడ్‌లో సూపర్ హిట్‌కొట్టిన ‘రాక్షసన్’ రీమేక్‌లో సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఈనెల 21న సినిమా లాంచ్ కానుంది. విష్ణువిశాల్, అమలాపాల్ జంటగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగులో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.