డబ్బింగ్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి కాజల్ పదేళుల దాటింది. అయినా ఇప్పటికీ తెలుగును మాట్లాడలేకపోతోంది. ఆమెకన్నా వెనుక వచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్ కూడా డబ్బింగ్ చెప్పేస్తోంది. తమన్నా కూడా అదే దారిలో ఇటీవల ‘ఊపిరి’ సినిమాలో తన డబ్బింగ్ తాను చెప్పుకుంది. ఇన్నాళ్లుగా కాజల్ డబ్బింగ్ ఎప్పుడు చెబుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు, త్వరలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో డబ్బింగ్ చెప్పనున్నదన్న సమాచారం సంతోషాన్ని ఇచ్చింది. కానీ, ఆ సంతోషం ఎంతసేపో నిలువలేదు. మొదట ఈ చిత్రానికి తాను డబ్బింగ్ చెప్పాలని కాజల్ నిర్ణయించుకుని, కొంత డబ్బింగ్ చెప్పాక కూడా దర్శక నిర్మాతలకు నచ్చకపోవడంతో మళ్లీ వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారని టాలీవుడ్ సమాచారం. అదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా దర్శకుడు స్పష్టం చేశాడు. కనుక ఈ చిత్రంలో కూడా కాజల్ డబ్బింగ్ విషయంలో వెనుకబడిపోయిందన్నమాట.