నాన్‌స్టాప్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమల్‌హాసన్- క్రేజీ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 మొదటి షెడ్యూల్ చెన్నైలో మొదలై నాన్‌స్టాప్‌గా సాగుతోంది. షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. అయితే షూటింగ్ ఎప్పుడో మొదలుకావాల్సి ఉన్నా, మేకప్ విషయంలో కమల్ అసంతృప్తి కారణంగా ఆలస్యమైందని వార్తలు వచ్చాయి. తాజాగా కమల్ వీటిని కొట్టిపారేశారు. చిత్రం మేజర్ షూటింగ్ అంతా విదేశాల్లోనే జరగనుంది. అనిరుథ్ సంగీతం అందిస్తున్న చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే, రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం 2020 సంక్రాంతికి విడుదల కానుంది.