తియ్యతియ్యటి.. నవ్వులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా వస్తున్న డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్ దర్శకుడు. డాక్టర్ ప్రభాత్‌కుమార్ నిర్మాత. వివేక్‌సాగర్ సంగీతం అందించారు. 22న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆడియోను విడుదల చేశారు. ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘అందరూ అనుకున్నట్టు నేనింకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే అనుకోకుండా రోల్స్ రావడంతో చేస్తున్నా. యాక్టింగ్ చాలా కష్టమనీ అర్థమైంది. ‘మిఠాయి’ చూస్తుంటే గర్వంగా ఉంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ ‘సైన్మా’, ‘పెళ్లిచూపులు’ చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఇంత ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతానని అనుకోలేదు. మాకు నచ్చినది చేశాం. వర్కౌటైంది. మిఠాయి చూస్తున్నప్పుడు ఈ టీమ్ అంతా నచ్చిన పనిని ఎంజాయ్ చేస్తూ చేశారన్న ఫీలింగ్ కలిగింది. ప్రశాంత్‌తో మాట్లాడినప్పుడు సరదాగా షూటింగ్ చేశామన్నారు. టీమ్ ఎంజాయ్ చేస్తూ, ఆడుతూపాడుతూ చేసిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అన్నారు. దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్, నేనూ క్లాస్‌మేట్స్. ఆల్మోస్ట్ రూమ్మేట్స్ కూడా. కాలేజీ రోజులనుంచి ప్రశాంత్‌కు సినిమాలంటే చాలా ఇష్టం. మాకు చాలా విషయాలు చెప్పేవాడు. లక్కీగా నేను ముందు దర్శకుడయ్యా. ‘మిఠాయి’తో ప్రశాంత్ దర్శకుడిగా మారుతున్నాడు. ఇది ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రశాంత్ సెన్సాఫ్ హ్యూమర్‌గానీ, తను ఫాలోఅయ్యే యాక్టర్స్‌గానీ డిఫరెంట్ లెవెల్. ఈ సినిమా హిట్టవుతుందని అనుకుంటున్నా. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రశాంత్... అందరికీ ఆల్ ద బెస్ట్. వివేక్‌సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’ అన్నారు.
దర్శకుడు శ్రీహర్ష కొనగంటి మాట్లాడుతూ ‘నా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన చిత్రమిది. ‘హుషారు’ షూటింగ్ చేసేటప్పుడు సినిమా గురించి రాహుల్ మంచి విషయాలు చెప్పేవాడు. ప్రేక్షకులు అందరిలా నేనుకూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నా. డార్క్ హ్యూమర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం’ అన్నారు. సినిమా దర్శకుడు ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ ‘నా కథపై నమ్మకంతో సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రభాత్‌కుమార్‌కి థాంక్స్. నా అకౌంటులో జీరో బాలన్స్ ఉన్నా షూటింగ్ స్టార్ట్ చేసేవాణ్ణి. హండ్రెడ్ పర్సెంట్ ప్రభాత్ ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తాడని నమ్మకం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, షఫీ.. అందరూ ఎంతో హెల్ప్ చేశారు’ అన్నారు. సినిమా నిర్మాత ప్రభాత్‌కుమార్ మాట్లాడుతూ ‘నేను ఓ డాక్టర్. నన్ను నిర్మాతను చేసింది ప్రశాంతే. తను ఏడాదిన్నరపాటు సినిమా కోసం కష్టపడ్డాడు’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రశాంత్‌కుమార్ ఈ కథ ఇచ్చి చదవమన్నాడు. సరేనని చదివా. ఇదేదో కొంచెం డార్క్ డార్క్ ఉందని అనుకున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక అంతా సెట్‌అయ్యింది. నటీనటులకు దర్శకుడు ప్రశాంత్ చాలా స్పేస్ ఇచ్చాడు. అతడికి ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ, ఆయనకు తెలుగు సినిమా అంటే ఎంత ప్రేమంటే.. ఎక్కడ ఎక్కడనుంచో డబ్బులు తీసుకొచ్చి సినిమా పూర్తిచేశాడు. సెట్స్‌లో మేం తెలుగులో మాట్లాడేవాళ్ళం. తనకు సరిగా అర్థమయ్యేదికాదు. అందరం ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. సినిమా బాగా వచ్చింది. ఈనెల 22న థియేటర్లకు రండి. మీరూ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నవ్విస్తాం’ అన్నాడు.