సౌత్ ఐ లవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్‌గా పరిచయమైన తాప్సి సక్సెస్‌లు రాకున్నా అదృష్టం కొద్ది తెలుగులో చాలా చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు తెలుగులో మెల్లమెల్లగా ఫేడవుతున్న సమయంలో బాలీవుడ్‌కు వెళ్లింది. బాలీవుడ్‌లో అడపాదడపా చిత్రాలు చేస్తూ వస్తోంది. స్టార్స్ సినిమాలో నటిస్తున్న కారణంగా తాప్సికి అక్కడ మంచి గుర్తింపే దక్కింది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నా సౌత్ సినిమాలను మాత్రం వదలనంటోంది సొట్టబుగ్గల తాప్సి. తనకు సినీ కెరీర్‌ను ప్రసాదించిన సౌత్ సినీ ఇండస్ట్రీ ఎప్పుడుకూడా ముఖ్యమేనని, బాలీవుడ్‌లో ఎంత బిజీగావున్నా సౌత్‌లో మంచి ఆపర్లువస్తే తప్పకుండా నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె ‘గేమ్ ఓవర్’ అనే ద్విభాష చిత్రంలో నటించింది. వీల్‌చైర్‌కు పరిమితమైన పాత్రలో తాప్సి కనిపించనున్నట్లుగా ఫస్ట్‌లుక్ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తూ చేశామని, సౌత్‌లో సినిమాను చేయడంను తాను ఆస్వాదిస్తానంటూ తాప్సి పేర్కొంది. సౌత్ సినిమాలను వదిలిపెట్టకుండా ఏడాదికి ఒక్కటైనా చేయాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.